మ్యాచింగ్ అన్న పదం లేకుండా ఫ్యాషన్ లేనే  లేదు. అన్నీ నగల సెట్లూ వచ్చాయి. ఇప్పుడు ఓ గాజు దానికి మ్యాచ్ అయ్యే ఉంగరం లేటెస్ట్ గా కనిపిస్తున్నాయి. ఫ్యాషన్ గా ట్రెండీగా కనిపించే గాజునీ ,దానికి మ్యాచ్ అయ్యే ఉంగారాన్ని జతచేశారు. బంగారంతో పాటు ,ప్యాన్సీ రకాల్లో కూడా ఈ బ్రాస్ లెట్ ఉంగరాలు సెట్లు వచ్చాయి. గులాబీ,నీలం, పసుపు పచ్చ రాళ్ళతో పాటు ,తెల్లని రాళ్ళతో పొదిగిన బ్రాస్ లెట్ అచ్చం అలాంటిదే కలిపిన ఉంగరాలు రెండు ట్రెండీగానే ఉంటాయి. స్పెషల్ గా అనిపించాలి అనుకొన్న రోజు సంప్రదాయ దుస్తులు ఈ ట్రెండీ బ్రాస్ లైట్ ఉంగరము పెట్టేసుకొంటే చాలు పార్టీలో ఫస్ట్ మార్కులు తెచ్చుకోవచ్చు బ్రాస్ లెట్ ,రింగ్ సెట్ కోసం నెట్ లో బోలేడన్నీ ఇమేజెస్ ఉన్నాయి.

Leave a comment