ఏదైనా ప్రత్యేక సందర్భాల కోసం చక్కని యాంటిక్ డైమండ్ జ్యువెలరీలు ఎంచుకొంటారు. ఇవి ఫ్యాషన్ కూడా. సెజార్ట్,మొజాయిట్ ,అన్ కట్ డైమాండ్ గోల్డ్ నగలు టెంపుల్ జ్యులవెలరీ స్టైల్ నుంచి వచ్చాయి. ఇప్పుడు వీటికి ఆదరణ పెరిగింది. అయితే కొనే సమయంలో కాస్త శ్రద్ధగా ఉండాలి. ముందుగా 91.4 హోల్ మార్క్ ఉందా లేదో చూసుకోవాలి. ఈ నగలు కేవలం పెట్టుబడి కోసంగా ఉంటుంది.పూర్తి బంగారం వేసుకోవాలి. అయితే ఇవి మారిస్తే మాత్రం వేస్టేజీ మేకింగ్ చార్జులు పోతాయి. ఇక అన్ కట్ డైమాండ్స్ లో మోజలైట్స్ అనే ఒక రకం డైమాండ్ కాస్త ఖరీదు తక్కువ..డైలీ వేర్ గా ధరించాలంటే డైమాండ్ నగల్లాగే ఉండే మోజలైట్ సెట్ తీసుకోవచ్చు. ఇవి తిరిగి మార్చేందుకు కుదరవు. సంనప్రాదాయ నగలు కోరుకోంటే ఈ యాంటీక్ డైమాండ్ జ్యువెలరీ చక్కగా ఉంటాయి.

Leave a comment