నీహారికా,
ఇవ్వలొక కథ చెపుతాను. సమాజంలో పది మందితో కలిసి జీవించడం వల్ల కలిగే లాభం గురించిన కథ. ఒక ఇంజనీరు ఫ్యాక్టరీలో పనిచేస్తూ సమయం చూసుకోలేదు. ఏదో యంత్రం బాగుచేసే పనిలోవుండి. దాన్ని పూర్తిచేసి చూస్తే ఎవళ్ళూ లేరు. బయట తాళాలు వేయడం, లైట్లు తీయడం తెలుస్తూనే ఉన్నాయి. ఇక ఈ రాత్రికి ఈ వేడిలో మంచినీళ్ళు, భోజనం లేకుండా గడవాలి కాబోలు అనుకొంటూ వుంటే, కొన్ని గంటల తర్వాత ఎవరో తాళం తీసి లోపలకు వచ్చిన సవ్వడి వినిపించింది. తాళం తీశారెవరో టార్చి లైట్ ఇంజనీరు పైన పడింది. వచ్చింది సెక్యూరిటీ గార్డ్స్. నేనిక్కడ చిక్కుకుపోయానని ఎలా గ్రహించారు అన్నాడు ఇంజనీరు. సార్ ఇంతమంది ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తూనే ఉన్నా నాకెవ్వరూ డ్యూటికి వస్తూ గుడ్ మార్నింగ్, వెళుతూ గుడ్ నైట్ చెప్పేది మీరొక్కరే. ఈ రోజు గుడ్ మార్నింగ్ చెప్పారు, గుడ్ నైట్ కోసం ఎదురు చూశాను. మీరు వాపస్ వెళ్లలేదని నాకు ఖచ్చితంగా అనిపించింది. అందుకని వెతుక్కుంటూ వచ్చానన్నాడతను. ఇది కథే కానీ వాస్తవం. అందరితో సఖ్యతగా, ప్రేమగా, గౌరవoగా వ్యవహరించాలని ఎప్పుడూ ఏదైనా ఇస్తూ వుంటే తిరిగి ఏదో రూపంగా మనకు వస్తూ ఉంటుందని చెప్పే మంచి కథ. తప్పకుండా గుర్తుంచుకో.