చక్కని ముడి మధ్యలో నాగరం ,జడకు మధ్యలో జడ బిళ్ళలు సంప్రదాయనగలు .ఇవి సనాతనకాలం నుంచి రాజుల కాలం నుంచి వస్తు ఉన్నాయి. ఇక కాలానికి తగ్గట్లు వీటి డిజైన్ లలో మార్పులు వచ్చాయి. సూర్యవంకలు, చంద్రవంకలు ,చామంతులు ఇలా జడబిళ్ళలు కొత్త డిజైన్ లలో వచ్చాయి. ఇప్పుడు ప్రత్యేక సందర్భాల్లో అమ్మాయిలు వీటిని జడపొడుగునా ధరిస్తున్నారు. సాధారణమైన బ్యాండ్ కి గుడ్డు ఇప్పుడు బంగారు జడబిళ్ళలు షాపుల్లో దర్శనం ఇస్తున్నాయి. వట్టి బంగారుతో చేసినవి ముత్యాలు, రత్నాలు ,పచ్చలు కలగలిసి చేసినవి ఎన్నో రకాల జడ అందం కోసం డిజైనర్లు తయారు చేశారు చక్కని పొడవాటి జడకు ఈ జడబిళ్ళల అందమే అందం.

Leave a comment