జయ జయ నృసింహ సర్వేశా!!

కర్నాటక సరిహద్దులో బీదర్లో మనం దర్శించవలసిన స్వామి “జలా నృసింహస్వామి”.  నృసింహుడు అంటే గుర్తుకు వచ్చేది ప్రహ్లాద చరిత్ర,కానీ ఇక్కడ నృసింహుడు చరిత్ర పరమ పావనం.ఇక్కడ దేవాలయం పూర్వం నవాబుగిరి చెందిన కట్టడం.
శివుడు ఈ కొండ గుహలో తపస్సులో వుండగా జలాసుర అనే రాక్షసుడు సర్వ విధాల తపోభంగం కలిగించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నృసింహస్వామిగా అవతారమెత్తిన విష్ణు మూర్తి హిరణ్యకశిపుని ఖండించి అడవి ప్రాంతంలో సంచరిస్తుండగా శివుని వ్రత భంగం చూసి కోపోద్రిక్తుడై జలాసురుడిని నృసింహుడు ఖండించాడు.చివరి ఘడియలో ఒక కోరిక కోరుకున్నాడు నృసింహస్వామిని జలాసురుడు.తన పేరు శాశ్వతంగా అందరూ స్మరించేటట్లు ఈ స్ధలం జలా నృసింహస్వామినిగా ప్రసిద్ధి పొందాలి అని అర్థించి అనుగ్రహం కలగడం విశేషం.
జలా నరసింహ స్వామి దర్శనానికి భక్తులు గుహలో గల జలప్రహవం నుండి వెళ్ళాలి.పచ్చని చెట్లు,కొండల మధ్య ఈ దేవాలయం వుంది.

 

ఇష్టమైన పూలు: ఎరుపు రంగులో ఉన్న పూలు

నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు.

 

         -తోలేటి వెంకట శిరీష 

 

Leave a comment