Categories
-డి. సుజాతా దేవి
నిన్ను తలుసుకు మావ
నిదరకొరిగన యాల
నిదరంత కలలాయె
కలలన్ని నువ్వాచయె!!
అల్లరీ పిల్లెవరొ
అలుముకున్నది నిన్ను
అదిరిపడి నే రాగ
అది గాలి అన్నావు !!
సొగసు గత్తెది నిన్ను
సుట్టి ముద్దాడింది
ఎర్రగా నే సూడ
ఎన్నెలని నవ్వాడు!!
ఒగలాడి అది నిన్ను
ఒళ్ళంత తడిమింది
ఒల్లగాదంటె అది
వాన జల్లన్నావు !!
మతిలోన మతిలేక
మంతనాలాడేవు
మాట లెవరితో అంటే
మల్లితో అన్నావు!!