వృక్షశాస్త్రం లో పి హెచ్ డి పొందిన తొలి మహిళా జానకీ అమ్మాళ్. మద్రాస్ ప్రెసిడెన్సీ లోని తెరి చెర్రీలో 1897 నవంబర్  4వ తేదీన జన్మించారు . తండ్రి ప్రోత్సహంతో ఉన్నత చదువులు చదివారు . మద్రాస్ లోని ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి 1924 లో బోటనీలో ఆనర్స్ డిగ్రీ పూర్తి చేసాక మిషిగాన్ వెళ్ళారు అక్కడ బార్డర్ స్కాలర్ షిప్ పొంది బోటనీ లో మాస్టర్స్ పూర్తి చేశారు . అమెరికాలో వృక్షశాస్త్రం లో పి హెచ్ డి పొందిన తొలి మహిళగా రికార్డ్ సాధించారు . తోటల్లో పెంచుకొనే మొక్కలు ,పర్యవరణ వృక్షాలపై ఆమె పరిశోధనలు చేశారు . భారత ప్రభుత్వం 1971లో జానకీ అమ్మాళ్ కు పద్మశ్రీ తో సత్కరించారు .

Leave a comment