– డి.సుజాతా దేవి

చిచ్చొళో హాయీ
చిచ్చొళో హాయీ
చిట్టి పాపాయీ
బూచి వస్తాను
బుట్ట తెస్తాను
బజ్జో వేమోయి !!

వద్దన్న వచ్చింది
పొద్దెక్కి ఎండ
సద్దుసేయక తొంగిచూసి
పాలబుగ్గలమీద
వాలింది వచ్చి
చుర చుర చుర !!

మళ్ళి వచ్చిందమ్మ
అల్లరి గాలి
ఉయ్యాలలో చేరి ఊగి
మోగించి పోయింది
మువ్వల్ల గిలక
గల గల గల గల
గల గల గల గల !!

Leave a comment