-డి.సుజాతాదేవి

కళ్ళేమో కాసింత
కనబడు జగమే వింత
యాడ దాసుకోవాలి
ఇన్ని సోకు లిన్నందాలు !!
మల్లిపూలా గాలి
సల్ల సల్లగ తేలి
చెప్పజాలని సుకము
తెప్పలూగించేను !!

ఆ సెట్టు ఎగిరెగిరి
అందుకొన్నది మబ్బు
నింగి నీలము తోటి
పచ్చదనముల పోటి !!

పాట పాడే పూలు
పరిమళించే గాలి
ఊపిరూదే రేలు
బతుకంత ఇక సాలు!!

Leave a comment