రామ రామ రామ సీత!!

తిరుమల తిరుపతికి సమీపంలో ఉన్న జపాలి ఆంజనేయ స్వామివారి సన్నిధిలో సేవకు వెళుతున్నాం, మీరు రండి సఖులూ!!
పూర్వం మహాఋషులు తపస్సు చేస్తున్న ఈ కొండలలో జాబాలి మహర్షి తపస్సు చేస్తున్న సమయంలో ఆంజనేయ స్వామి ప్రత్యక్ష మైనాడని,ఈ ప్రదేశంలో సీతా సమేతుడై రాములవారు కూడా సంచరించాడని చెబుతారు.
జాబాలి అనే పదం నానుడిలో జాపాలిగా  ప్రసిద్ధి చెందింది.ఇక్కడ ఒక కోనేరు వుంది. స్నానం చేసిన సర్వ పాపాలు,రోగాలు పోతాయి.ఇక్కడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.కాలి నడకన వెళ్ళి దర్శనం చేసుకుని మోక్షం పొందడానికి తండోపతండాలుగా భక్తులు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,చిట్టి గారెలు, అప్పాలు.

 -తోలేటి వెంకట శిరీష

Leave a comment