ప్రతి అంశాన్ని మార్కెటింగ్ తో ముడిపెట్టి చూడగలిగితే ఎన్నో బిజినెస్ ఐడియాలు వస్తాయి. హిరోకిటెరాయి అనే పెద్ద మనిషికి ఏడిస్తే హృదయవేదన బాధ తగ్గుతోందనే ఆలోచన వచ్చింది. అలా ఏడ్పించటం మంచి బిజినెస్ అని కూడా అర్ధం అయింది.ఆయన మొదలు పెట్టిన ఈ క్రయింగ్ బిజినెస్ ఇప్పుడు యువతని తీవ్రంగా ఆకర్షిస్తుంది. జపాన్ లో క్రయింగ్ క్లబ్ లు వెలుస్తున్నాయి. ఇక్కడకు వచ్చిన వారికి విషాద గీతాలు వినిపించి ,విషాదకరమైన సినిమాలు చూపిస్తూ ఎలాగోలా ఏడ్పించేస్తారు. ఏడిస్తే ప్రశాంతత తో పాటు కొత్త ఆలోచనలు వస్తాయని జపాన్ యువతరం నమ్మేశారు. ఇప్పుడీ ఏడ్పించటం కూడా ఒక అత్యవసర ధోరిణిగా మారింది. దీన్ని రుయి కత్సుగా పిలుస్తారు.అంటే ఏడ్పించే పని అని అర్ధం

Leave a comment