Categories
టెంపుల్ డిజైన్లు,భారీ కొంగులతో పట్టుచీరె వేడుకకు అందం తెచ్చేలా ఉంటుంది. కానీ రానురాను పట్టు చీరె రూపం మార్చుకొంది,కొన్ని ముదురు రంగుల్లోనే కొట్టాచ్చినట్లు కనబడే కంచి చీరె వర్ణాలు మార్చుకొంది బరువు తగ్గించుకొని తేలికైన చీరగా కూడా తయారైంది.బంగారు జెరీగళ్ళ,నెమళ్ళ,గుర్రాలు హంసల తో పూల అందాలతో టెంపుల్ మేటిఫ్ లలో లేత రంగు చీరెలకు డిమాండ్ వచ్చింది. వెండి పూల అందాలు అద్దుకొని కొంగుపై బంగారు జారీ బ్రోకేజ్ తో వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించేలా ఉన్నాయి.నీలం మెలన్,ఆరెంజ్,ముదురు ఆకుపచ్చ,గులాబీ ఉదారంగుల్లో మయురాలు, పూల లతతో జతగా అదే రంగు బ్లవుజులతో ఇవ్వాళ పట్టు చీరె అమ్మాయిలు ఇష్టపడే నాజూకైన చీరెలా మారి పోయింది.