ఇప్పుడు తమిళనాడు ఎక్కడ విన్నా  ఐదారు అమ్మల  ముచ్చటే. మొత్తంగా అందరికి కాన్ సన్  ట్రేషన్ తమిళనాడు వైపే ఉంటుంది. రాజకీయ చక్రం తిప్పుతానంటున్న శశికళ కోరిక నెరవేరుతుందా లేదా అన్న ప్రశ్నలు అవతల పారేస్తే అమ్మ జయలలిత జీవితం ఆధారంగా సినిమా తీస్తే  బావుంటుందని  ఆవిడ పోయినప్పటినుంచే సినిమా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ఆలా ఉంచి బతికున్న రోజుల్లో ఎదో ఇంటర్వ్యూ లో ఒక వేళ తన జీవితం ఆధారంగా సినిమా తెస్తే అందులో ఐశ్వర్య రాయ్ బావుంటుందని యవ్వనంలో ఉన్నప్పటి పాత్రకు ఐశ్వర్య చక్కగా సూటవుతుందని ముఖ్య మంత్రిగా ఆ తర్వాత కూడా నటించటం పెద్ద కష్టమేం కాదని స్వయంగా జయలలితే చెప్పారు. మణిరత్నం తీసిన ఐదారులో కూడా జయ లలిత గుర్తు చేసే పాత్రలో ఐశ్వర్య నటించింది. ఇప్పుడు అమ్మ జీవిత కధ లో సంప్రదిస్తే ఐశ్వర్య ఏమంటుందో మరి. సినిమా కధల కంటే సస్పెన్స్ థ్రిల్లర్ లాగే అమ్మ జీవితం ముగియటం విషాదం.

Leave a comment