సూర్యుని వెలుగు కిరణాలు నేలపై పరుచుకొంటూ ఉండగానే కొందరు పక్క దిగేస్తారు. వెలుగొస్తే నిద్రపోలేము అంటారు.కొందరు బారెడు పొద్దెక్కినా నిద్ర లేవరు .ఇలా త్వరగానూ ,లేదా ఆలస్యంగానూ నిద్రలేచే అలవాట్లను జీన్స్ ప్రభావితం చేయటమే కారణం అంటున్నారు పరిశోధకులు. శాస్త్రీయంగా చూస్తే శరీరాల్లో అంతర్గత సర్కాడియిస్ క్లాక్స్ ఉంటాయి. ఇవి హిపోథాలమస్ వద్దే వేలాది కణాలతో తయారై ఉంటాయి.ఇవి అన్ని రకాల శరీరక పని తీరులను ప్రభావితం చేస్తాయి. అలాగే నిద్రించే అలవాటు కూడా నిర్ధేశిస్తాయి. అంటే నిద్ర అలవాట్లు కూడా చిన్న తనం నుంచే సంక్రమిస్తాయన్నమాట.

Leave a comment