జీన్స్ ని కనిపెట్టాక వాటిని దాటిఫ్యాషన్ ఎన్నో అడుగులు వేసిందే లేదు. ఏదైనా జీన్స్ చుట్టే తిరుగుతున్నాయి. ఇప్పటికీ అమ్మాయిల ఫ్యాషన్ జీన్స్ పాంట్లు, షర్టులే. అయితే సాధారణ జీన్స్ ని కాన్వాస్ గా తీసుకుని రంగురంగుల చిత్రాలు సృష్టించి దాన్ని బోహా బిక డెనిమ్ జాకెట్ అన్నారు ఇది ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం రూపొందించింది. బొహిమియిన్ నేపాల్ హస్తకళల మేళవింపు తో వినూత్న ఆకృతులను సృజించి, వాటికి పూసలు రాళ్ళు పొదిగి అందంగా తయ్యారు చేసారు. ఈ డిజైన్స్ పుట్టిన దేశాల్లో బాగా పాప్యులర్ అయ్యాయి. ఈ ఫ్యాషన్ ట్రెండ్ ఇప్పుడే ఇండియాలోనూ కనిపిస్తుంది. ఆన్ లైన్ ట్రేడింగ్ మొదలయ్యాక, ఏ జీన్స్ అయినా ఆర్డరిస్తే ఇంటికొచ్చేస్తాయి కదా.

Leave a comment