Categories
జీన్స్ వాడే వాళ్ళు తప్పని సరిగా స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలని చర్మానికి తేమ అందించే కొబ్బరి బాదం నూనె ను తొడలకు రాసుకోవాలి లేకపోతే తొడలు కాళ్లపైన రాపిడి పెరిగి చర్మం నల్లగా అయిపోతుందని అంటున్నారు కాస్మెటాలజిస్ట్ లు. బిగుతుగా ఉండే ఈ ప్యాంట్లు వేసుకోవటం వల్ల ఒత్తిడి ఎక్కువై వెరికోజ్ వీన్స్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. జీన్స్ కాస్త వదులుగా ఉన్నవే ఎంచుకోవాలి. ప్రతిసారీ ఉతకాలి ఏడు ఎనిమిది గంటల కంటే ఎక్కువ సేపు వేసుకోకూడదు. తొడల చర్మం నల్లగా అయిపోతే మాయిశ్చ రైజింగ్ క్రీమ్ రోజుకు రెండు సార్లు రాసుకోవాలి.అలాగే స్క్రీన్ టైటినింగ్ క్రీమ్ లు రాసుకున్నా నలుపు తగ్గుతుంది.