ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు మారేది ఒక్క డ్రెస్సులే. ఎప్పుడు ఒకే లాంటివి అమ్మాయిలు ఇష్టపడరు. ఒక్క పార్టిలో ఒక సెల్ఫీ దిగేసి, ఫేస్ బుక్ లో పెట్టేసాక అవి ఇంక పాత డ్రెస్సులే. ఇంకొ ఫంక్షన్ కు ఇవి పనికి రానివనే డిసైడ్ చేస్తారు.సల్వార్ కమీజ్ మోకాళ్ళ వరకో కాస్త కింద వరకో వుండేది కదా.అలాగే కాళ్ళాను కప్పేస్తూ నేలను జీరాడే లాగా చుట్టూ కుచ్చిల్లు కనిపించేలా వచ్చేసాయి. వీటి పైకి లాంగ్ స్కర్ట్స్ లేదా నడుము వరకు డిజైనర్ బ్లౌజులు వచ్చేసాయి.ఇలా జీరాడే డ్రెస్సులకు కట్ వర్క్, ఎంబ్రాయిడరీ పనితనం, వాటికి తోడు పూసలు, రాళ్ళూ ధగధగ లాడి పొతే ఇక ఆ అడ్రెస్స్ అందమే అందం. కొత్త సంవత్సరం కోసం ఈ సల్వార్కమీజ్ ను ఓసారీ చూడొచ్చు. లాంగ్ అనార్కలి సల్వార్స్ కూడా మంచి డిజైనర్ అంచులతో బ్యూటిఫుల్ గావున్నాయి.

Leave a comment