సోంపు ను చీజ్, బ్రెడ్, వెజిటేబుల్ వంటకాలు విశేషంగా వుపయోగిస్తారు. నాన్ వెజ్ కూరల్లో సోంపు పొడి వాడతారు. కేక్స్, బిస్కెట్స్ బ్రెడ్ లో ఉపయోగించే ఈ సొంపులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది చక్కని ఎనర్జీని ఇవ్వగలదు. పోషకాలు, యాంతాక్సిడెంట్లు డైటరీ ఫైబర్, ఎసెంషియల్ కాంపౌండ్స్ వున్నాయి. కాపర్, ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలున్నాయి. విటమిన్ A,E,C లతో పాటు బి-కాంప్లెక్స్ విటమిన్స్ పుష్కలంగా వున్నాయి. కీళ్ళ నొప్పులు తగ్గేందుకు సోంపు నూనె తో మసాజ్ చేస్తారు. బాలింతలకు పాలు పడేందుకు కుడా విందుల్లో షుగర్ కోటెడ్ సొంపూని ఇస్తారు. తీసుకున్న ఆహారం జీర్ణం అయ్యేందుకు ఇది బాగా ఉపయోగ పడుతుంది.

Leave a comment