వారంలో రెండు రోజులు సెలవుగా ఉంటుంది కార్పోరేట్ సెక్టార్ లో. ఐదురోజులు క్షణం తీరిక లేని వత్తిడిలో పనిచేయడం, మిగిలిన రెండు రోజులు సరైన నిద్రలేకుండా లేజిగా గడపటం ఇవాల్టి యువతరం అలవాటు చేసుకుంటున్న పద్దతులు. ఒక రోజు నిద్ర మేల్కొన్న, ఆలస్యంగా లేచిన పర్లేదు కానీ అదే పనిగా నిద్ర వేళలు మారిస్తే తప్పే అంటున్నారు డాక్టర్స్. ఒకటి రెండు గంటలు తేడాగా నిద్రపోయినా, నిద్ర లేచినా, ఒక వారం నైట్ షిఫ్ట్ ,ఇంకో వారం డే షిఫ్ట్ లుగా  పనిచేస్తున్నా జీవ గడియారం దెబ్బ తింటుంది. శరీరంలోని హర్మోన్లన్ని ఈ జీవగాడియారంపై ఆధారపడి పనిచేస్తాయి. ఇలా తరచూ మార్పులకు గురైయితే ఈ హెచ్చు తగ్గులవల్ల ఆరోగ్యం పాడవడటం ఖాయం అంటున్నారు. పద్దతిగా పది గంటలు రోజులోని నిద్రపోవడం ఐదు, ఆరు గంటల మద్య నిద్రలేవడం అలవాటు చేసుకోమంటున్నారు.

Leave a comment