Categories
Soyagam

జీవన శైలి మార్పులతో కొంత ఉపసమనం.

అమోతిమలు పోవాలంటే కేవల మందులు క్రీములు మాత్రమే వాడితే లాభం లేదు. జీవన శైలి లో మార్పులు చేసుకోవాలి. అసలు కారణం గుర్తిస్తే మరింత సులువు అవుతుంది. హార్మోన్ల అసమతుల్యత, చుండ్రు, వత్తిడి, సీజనల్ మార్పులు ఏదైనా మొటిమలకు కారణం కావొచ్చు. వేపుడు, నూనె వస్తువులు మానేయాలి. వీటి బదులు పీచూ, పదార్దాలు ఎక్కువగా తీసుకోవాలి. సరైన హైడ్రేషన్ లేకపోయినా మొటిమలు వస్తాయి. ప్రతి రోజు నీరు బాగా తాగాలి. వేపాకులు , పుదీనా ఆకులూ, ద్రాక్ష గుజ్జు గ్రయిండ్ చేసి మొటిమలపై రాయాలి. మొటిమలు గిల్లితే మచ్చలు పడే ప్రమాదం వుంది. యుక్త వయస్సులో మొటిమలు రావడం సహజం కనుక మరింత ఆదుర్దా అయితే వద్దు. ఏ రకంగా నైనా మొటిమలు వీపు బుజాల పైన ఎక్కువగా కనబడినా వెంటనే సలహా తీసుకోవడం మంచిది.

Leave a comment