Categories
Nemalika

జీవితకాలపు జ్ఞాపకంగా మలచుకోవాలి

నీహారికా,

పెళ్ళవగానే వెంటనే హనీమూన్ అంటుంటారు. అలా వెంటనే ఆనవాయితీనా, వెల్లితీరాలా అన్నావు. అదేం కాదు. ఒకళ్లనోకళ్లు అర్ధం చేసుకొనే ఏకాంతo కోసం అని ఒక పద్ధతి అలవాటు చేసుంటారు కానీ పెళ్లి అయ్యి అవ్వగానే ఫ్లయిట్ ఎక్కేయడం గురించి మాత్రం కొంచెం ఆలోచించుకోవాలి. పెళ్ళికి ఎంతోమంది బంధువులు, మిత్రులు వస్తారు. అటూ ఇటూ పాటించవలసిన సంప్రదాయాలు వుంటాయి. వెంటనే ప్రయాణం కాస్త ఒత్తిడే. అసలు భార్యాభర్తలు ముందే కొత్త. ఒకళ్ళ అలవాట్లు, ఇష్టాలు ఇంకొకరికి తెలియవు. పైగా కొత్త చోట్లు. అంచేత పెళ్ళయ్యాక ఒకటి రెండు నెలల తర్వాత ఈ ప్రయాణం పెట్టుకొంటే కొంత సౌకర్యం. పైగా ఇవాల్టి తరం యువత ఇద్దరూ ఉద్యోగులే. సంపాదించి సేవ్ చేసుకొన్న సొమ్ముతోనే ఈ పెళ్లి, షాపింగ్ లు, ప్రయాణాలు. పైగా సెలవులు ఇబ్బంది. ఇవన్నీ ఇద్దరు కూర్చొని ఆలోచించుకునే చనువు ఇద్దరి మధ్య వచ్చాక, ఇద్దరు కలిసి కూర్చుని వెళ్ళవలసిన ప్రదేశాలు ముందే ఎంచుకొని, కంఫర్టబుల్ గా అన్నీ బుక్ చేసుకొని కాస్త తీరుబడిగా ఈ హనీమూన్ ని ఇంకా తీయని యాత్రగా మలుచుకోవచ్చు.

Leave a comment