చర్మ సౌందర్యం విషయంలో ఎదో ఒక రోజు శ్రద్ధ తీసుకుని ఒక రోజు ఫేషియల్ చేయించేసుకుంటే సరిపోదు. శ్రద్ధ జీవిత కాలం వుండాలి. సహజమైన, రసాయినాలు లేని పదార్ధాల వాడకంతో చర్మం ఎప్పుడు తాజాగా కాంతి వంతంగా వుంటుంది. పిండి, తేనె, పెరుగు వంటి మిశ్రమం వంటికి పట్టించి నలుగు పెట్టుకుంటే చాలు చర్మం ఎప్పుడూ బాగుంటుంది. అలాగే జుట్టు నిర్జీవంగా అనిపిస్తే కోడి గుడ్డు తెల్ల సోన, పుల్లటి పెరుగు, మందారకుల గుజ్జు కలిపి తలకు పట్టించి తల స్నానం చేస్తే జుట్టు పట్టు కుచ్చులా అయిపోతుంది. అలాగే చేతులు కాళ్ళు మెత్తగా మెరిసిపోవాలంటే ముందుగా ఆర బకేట్ నీళ్ళల్లో రెండు చెంచాల షాంపూ వేసి పదాలు అందులో వుంచాలి. ఆ తర్వాత ఫ్యుమిక్ రాయి తో రుద్దాలి. ఇలా చేస్తే మృతకణాలు పోతాయి. అదయ్యాక చెక్కర, సెనగ పిండి, పాలు, తేనె మిశ్రమాన్ని పాదాలకు పట్టించి  ఆరాక కడిగేస్తే పదాలు మృదువుగా మెరిసిపోతూ కనిపిస్తాయి. చేతులకు కూడా ఇదే పూత పుయచ్చు.

 

Leave a comment