నీహారికా,

ఆలోచనలో పడేసే రిపోర్టు ఒక్కటి వచ్చింది. ఒకే ప్రశ్న ఉదయం నుంచి మీరు ఎంత సేపు నవ్వారు అంటే ఏం చెప్తాం. నవ్వెందుకు సమయం లేదు. ఒక సహజమైన సంతోష భావనకు జీవితంలో చోటివ్వకుండా గడిపేస్తున్నామన్నమాట. చక్కగా నవ్వితే చాలు, మెదడులో ఎండార్ఫిన్స్ అనే రాసాయినాల స్ధాయి పెరుగుతోంది. అవి పెరిగితే చురుకుదనం వస్తుంది. చక్కెర స్ధాయిలు నియింత్రించే కొన్ని హార్మోన్లు విడుదల అవ్వుతాయి. ప్రశ్న చాలా ఇబ్బంది పెట్టింది. మనం నవ్వాలనుకొంటే ఈ లోకంలో ఎన్ని మర్ఘాలు లేవు. నవ్వుల సినిమా కావొచ్చు, జోక్స్ పుస్తకం కావొచ్చు, హాస్య నాటకం కావొచ్చు, కార్టూన్, కామిక్ స్ట్రిప్ ఏవైనా నవ్వొస్తుంది. ఫ్రెండ్స్ తో జోక్స్ పంచుకోవడం, సరదా మాటలు వినడం, మనలోపలి నవ్వును వెలికి తెస్తాయి. ఎందుకో మరి గంభీరంగా మొహం పెట్టుకుని నవ్వు కడుపులో దాచేసుకుని తిరుగుతుంటాం. ప్రతి రోజు కొంత సమయం మనసారా నవ్వగలిగితే ఎన్నో శారీరక తిరుగుతాం. ప్రతి రోజు కొంత సమయం మనసారా నవ్వ గలిగితే ఎన్నో శరీరక మానసిక చికాకులు మాయం అవుతాయింటుంది రిపోర్టు. తాజా పరిశోధన ప్రకారం నవ్వు జీవితాన్ని మార్చేస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. కోపాన్ని మాయం చేస్తుంది. ఆడుర్దా కంగారు వంటి ప్రతి కూల భావోద్వేగాలకు లొంగకుండా చేస్తుంది. ఎలా గోలా నవ్వుని కాపాడుకుని మొహం పైన వెలిగించాగాలిగితే…. అందమైన మొహం అద్దంలో చూసుకోవచ్చు.

Leave a comment