Categories
Nemalika

జీవితం ఒక వరం అనుకుంటే చాలు.

నీహారికా,

మన  కోసం మనం చేయవలసిన మంత్ర జపం ఏమిటో చెప్పనా ఐయామ్ బ్లెస్ట్ అని మనకి మనం చెప్పుకోవడం. వట్టినే మాట కాదు సుమా నమ్మాలి కూడా, నాకే జీవితం ఓ వరం అనుకుంటే ఇక ఎలాంటి నిరాశలు మనకి దగ్గరగా రావు. ఇక ఈ మాటే మంత్రం అనుకుని దైనందన కార్యకలాపాలలో మునిగిపోవాలి. మనలో నిండిన సంతోషం మన పరిసరాలని, చుట్టు పక్కలవారికి సంతోషంగా ఉంచుతుంది. సంతోషంగా నిద్రపోవచ్చు. చక్కని కళలు కనొచ్చు. సంతోషంగా నిద్రపోవచ్చు. అలాంటప్పుడు చిన్న ఆశాభంగం ఎదురయినా కుంగిపోకుండా ప్రతి వర్తమాన క్షణాన్ని గోవుగా భావించడం చేతనవ్వుతుంది. జీవితం అంటేనే ప్లెజర్ లు పెయిన్ లు రెండు కలగలసి ఉంటాయి. దుఖం చుట్టూ చిన్న చిన్న సంతోషాల వేర్లు పాకేందుకు సిద్ధంగానే ఉంటాయి. వాటికి కాస్త పోషణ చేస్తే చాలు ఇట్టే అతుక్కు పోతాయి. జీవితంలో తియ్యదనం కుడా తనివి తీరనంత వుంటుంది. ఆనందాన్నిచ్చె అనుభవాలు ఎన్నెన్నో ఉంటాయి. సంతోషం నిజానికి మనలోనే వుంటుంది. చిన్న పాప మాదిరిగా మన చుట్టూ జరిగే ప్రతి అంశానికి సంతోష పడటం నేర్చుకోవాలి. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలి. సంతోషం, సంతోషం, సంతోషం దీనికి ప్రత్యామ్నాయం అంటూ ఏదీ లేనే లేదు.

Leave a comment