కిస్బూ, కేరళలో మోడల్.ఈమె రాజస్థాన్ కు చెందిన సంచార తెగకు చెందిన అమ్మాయి. కేరళలోని కన్నూరు జిల్లా సమీపంలో అండలూరు లో అండలూరు కావు అనే ప్రాచీన రాముడి దేవాలయం ఉంది. రాముణ్ణి రామాయణాన్ని తలుచుకుంటూ ఫిబ్రవరి రెండవ వారంలో జరిగే తిరుణాలలో ఫోటో తీసేందుకు వచ్చిన అర్జున్ కృష్ణన్ అనే ఫోటోగ్రాఫర్ బెలూన్లు అమ్ముతున్న పదహారేళ్ల కిస్బూ అనే అమ్మాయి ఫోటో తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఒక్కరోజులో లక్షన్నర మంది ఈ ఫోటోలకు స్పందించారు. రెమ్య ప్రజుల్ అనే మేకోవర్ ఆర్టిస్ట్ సాయంతో కిస్బూ కు మేకప్ చేసింది. ఫోటో షూట్స్ చేస్తే ఆమె కాస్త ఇంటర్నెట్ సెన్సేషన్ అయిపోయింది. ఎన్నో కంపెనీలకు మోడల్ గా సెలెక్ట్ అయింది. ఒక్క ఫోటో కిస్బూ జీవితాన్ని మార్చేసింది.

Leave a comment