పిల్లలు చాలా మంది పండ్లు తినరు . కానీ పండ్లన్నీ కలసి ,ఓ కేక్ రూపంలో ఇస్తే వాళ్ళకు కేకులంటే ఇష్టం కనుక తినేస్తారు . అలాంటి కాన్సెప్ట్ తో వచ్చాయి జల్లీ కేక్స్ . తాజా పండ్ల ముక్కలన్ని జెలాటిన్ తో కలపి చేయటం వల్ల వాటిలో ఎన్నో పోషకాలు కూడా చక్కగా ఉంటాయి . ఇవి పుట్టిన రోజు పెళ్ళిరోజు వంటి వేడుకలకు కూడా చాలా అందంగా ఉంటాయి . ఈ కేకుల్లో పండ్ల ముక్కల్ని పట్టి ఉంచేలా జంతువుల కొవ్వుతో చేసిన జెలటిన్ గానీ సముద్రపు నాచుతో చేసిన జెల్లో కానీ వాడతారు . అగర్ అని పిలిచే సముద్రపు నాచులో ఖనిజాలు పీచు వంటి పోషకాలు కూడా సమృద్ధిగా ఉండటం వల్ల ఎక్కువ మంది దాన్ని ఇష్టపడతున్నారు . ఈ జెల్లీ ఫ్రూట్ కేక్స్ ని పిల్లలు చాలా ఇష్టపడుతున్నారు .

Leave a comment