ఎండతో చమటతో మొహాంపై స్వేద గ్రంధులు జిడ్డుపట్టి మూసుకు పోతాయి. చర్మం కాంతి తగ్గుతుంది. అందుకే ఎండలోంచి రాగానే ముఖం చల్లని నీటితో శుభ్రపరిస్తే స్వేదరంధ్రాల జిడ్డుపోతాయి. వారానికి రెండు సార్లు స్క్రేచ్ చేస్తే మృతకణాలు,బ్లాక్ హీడ్స్ పోతాయి. నూనెలు మాయిశ్చరైజర్స్ కొంత కాలం పక్కపెట్టి ,ముల్తాన్ మట్టి గంధం పొడి ఫ్యాక్ వేసుకుంటే చర్మం శుభ్రం పడుతుంది. నేరుగా చేత్తో ముఖం తుడుచుకోకుండా టిష్యూప్యాడ్ ను వాడాలి. వేపుళ్ళు నూనె పదార్థాలు ఈ వేసవిలో వాడటం మానేసి విటమిన్ ఎ అధికంగా ఉండే క్యారెట్ ,ఆకుకూరలు తాజాపండ్లు తినాలి. నీళ్ళు ఎక్కువగా తాగితే మొహావం జిడ్డు సమస్య లేకుండా పొఓతుంది.

Leave a comment