ఆరోగ్యం కోసం ప్రతి నిత్యం వ్యాయామాలు చేస్తూనే వుంటాం కదా అలసట దగ్గరకు రాకుండా షేర్ తింటున్నాం అన్నదాని పైన మన ఆరోగ్యం ఆధారపడి వుంది కొన్ని కాంబినేషన్స్ తినాలి. సాధారణంగా కండరాలు అలసిపోకుండా వుండాలంటే పనీర్ కాఫీ అరటిపండు సీమకోడి గుడ్లు ఖర్జురాలు ఓట్స్ చిలకడదుంపలు లాంటి శక్తి నిచ్చే పదార్ధాలు తినాలి. శరీరం లోని జీర్ణ క్రియలకు అవసరం అయ్యే పనీర్ మంచి ఫుడ్. అలాగే అరటిపండు పిండి పదార్ధం పుష్కలంగా పొటాషియం ఎక్కువగా ఉన్నాయి. ఇక కాఫీలో వుండే కెఫీన్ వ్యాయామం ముందు తీసుకుంటే కొవ్వు కరగటాన్ని వేగవంతం చేస్తుంది. సీమకోడిలో సోడియం తక్కువ కాబట్టి సంతృప్తి కొవ్వుల వల్ల  అరుగుదల ఎక్కువగా ఉంటుంది. గుడ్లు ఇన్సులిన్ స్థాయిలకు సరైన స్థితిలో వుంచుతాయి కనుక ఉడికించి నేరుగా తినటం వల్ల కండరాల నిర్మాణం లో ఎంతో ఉపయోగపడుతుంది ఓట్స్ ఆకలిని ఆపగలుగుతాయి ఖర్జురాలు తేలికగా అరుగుతాయి. చిలకడ దుంపలు గొప్ప శక్తి నిస్తాయి. వ్యాయామానికి వెళ్లే ముందర ఇవే తినవలిసిన పదార్ధాలు.

Leave a comment