అవసరం అన్ని భయాలు జయించేలా చేస్తుంది.45 సంవత్సరాల తట్టా జయలక్ష్మమ్మ అనకాపల్లి సమీపంలోని గవరపాలెంలో కాటికాపరిగా విధులు నిర్వహిస్తుంది. ఆమె ఇరవై ఐదేళ్ళ వయసులో భర్త చనిపోతే నలుగురు పిల్లల పోషణ కోసం ఈ స్మశాన వాటిక పనిలో అడుగుపెట్టింది. ముందుగా ఇంట్లో వాళ్ళు ఆ ఊరి వాళ్ళు అభ్యంతరం పెట్టారు కాని నేడు ఆడవాళ్ళయినా మగ వాళ్ళయినా ఏపని అయినా చేయగలరు. చేయోచ్చు అని చేసి చూపించాను. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేశాను. నాతో పాటు ఇంకో నలుగురికి ఇక్కడే ఉద్యోగాలు ఇచ్చాను అంటుంది వరలక్ష్మమ్మ.

Leave a comment