వైష్ణవి పూవేంద్రన్ మలేషియాలో ఉంటుంది నృత్యకారిణి. మోటివేషనల్ స్పీకర్.ఆమె కాన్సర్ బాధితురాలు. బోల్ట్ అండ్ బ్యూటీఫుల్ పేరుతో ఎర్రని పట్టు చీరె ,తలపై ఘంఘట్ ధరించి నవ్వుతున్న వైష్ణవి ఫోటోలు ఇన్ స్ట్రాగ్రామ్ లో సంచలనం సృష్టించాయి. నేను కాన్సర్ ను జయించాను ,కానీ ఈ అనారోగ్యం కాన్సర్ వ్యాధి గ్రస్తుల ఆశల్ని కల్లలు చేసేస్తుంది. ఊడి పోయిన జుట్టుతో నేను నవ వధువులా ఉంటానా? ఎన్నో సందేహాలు బాధపెట్టేవి. వెంటనే ఈ వెడ్డింగ్ ఫోటో చేశాను. ఎంతో సంతోషం అనిపించింది. నిజానికి మనల్ని మనం అభినందించుకోవాలి. మన జీవితాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి అంటోంది వైష్ణవి.

Leave a comment