మనకు ఎంతో ఇష్టమైన వారు దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం వారు వాడిన వస్తువులు దుస్తులు జాగ్రత్తగా భద్ర పరచుకుంటూ ఉంటారు. దీన్ని ద్రుష్టి లో పెట్టుకొని డెహ్రాడూన్‌ లో పుర్కాల్‌ స్త్రీ శక్తి అనే సమితిని ఏర్పాటు చేసింది నిరుపేద మహిళలకు ఉపాధి కల్పించే ఈ సంస్థలు. గత పదిహేను సంవత్సరాలుగా డెహ్రాడూన్ లోని నలభై గ్రామాల్లోని దాదాపు 200 మంది మహిళల మహిళలు ఈ సంస్థలో బొంతలు కుడతారు. ఈ మధ్యకాలంలో ముంబైకి చెందిన నిఖిత ప్రస్తుతం న్యూయార్క్ లో నివసిస్తూ, తన తండ్రికి సంబందించిన బట్టలు పుర్కాల్‌ స్త్రీ శక్తి సమితి కి బొంత కుట్టేందుకు ఇచ్చింది. వారు కుట్టిన బొంత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఈ సమితి విషయం లక్షల మందికి చేరింది.

Leave a comment