Categories
ఎవరైనా జోక్ వేయిగానే వెంటనే అర్ధం చేసుకొని నవ్వడం ఒక ఎత్తుయితే చాలామంది తమ పైన తామే జోక్ వేసుకొని ప్రశాంతంగా నవ్వుతుంటారు . తమ రూపం ,రంగు, బరువు మతి మరుపు ఇలాgటి విషయాల్లో ఇతరులు తమను గురించి ఏమనుకొంటుంటారో వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు .అలా తమపై తాము జోక్స్ వేసుకోగలిగే విశాలమైన మనసున్న వాళ్ళ స్వీయ ఆరోగ్యం ,ఆ స్వభావం వల్లనే బావుంటుంది . వారి మానసిక సంక్షేమ స్థాయిలు చక్కగా ఉంటాయని పరిశోధకులు అంటారు . తమని తాము అర్ధం చేసుకొని,తమ బలహీనతలు తామే తెలుసుకొని ,దాని గురించి బోల్డ్ గా మాట్లాడే వాళ్ళలో ఉండే పాజిటివ్ ధోరణి వాళ్ళని ఆరోగ్యంగా ఉంచుతుంది అంటున్నారు .