కాల్షియం, ఖనిజాలు పుష్కలంగా దొరికే  బీట్ రూట్ జ్యూస్ ప్రతి నిత్యం తాగండి ,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు న్యూట్రిషనిష్టులు. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను స్థిరికరిస్తుంది.  క్రమం తప్పక తింటున్న, జ్యూస్ రూపంలో తీసుకొన్న నాలుగు వారాల్లో రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.  గుండె జబ్బుల నుంచి రక్షణ ఇస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుంది.  బీట్ రూట్ లో సహాజమైన చక్కెరలు ఉంటాయి. తినే పదార్థాల స్థానంలో బీట్ రూట్ ను దైనందిన ఆహారంలో చెర్చుకోవచ్చు. పీచు అధికంగా ఉంటుంది కాబట్టి కాల్షియం ,ఖనిజాలు ఎముకలను ,పళ్ళను దృఢంగా ఉంచుతాయి. ఎముకలు పెళుసుభారకుండా కాపాడుతుంది.

Leave a comment