గార్డెనింగ్ పై ఆసక్తి ఉంటే క్యాబేజీ మైక్రో గ్రీన్స్ ఎలా పండించాలో నేర్పుతా అంటూ పోస్ట్ పెట్టింది సమంత. ఆమె టెర్రస్ గార్డెనింగ్ మొదలు పెట్టింది. మైక్రో గ్రీన్స్ అంటే సూక్ష్మమొక్కలు వీటిలో పోషకాలు ఎంతో ఎక్కువ ట్రే లో పండించిన క్యాబేజీ ఫొటోను షేర్ చేస్తూ,ఈ పంటకు కావలసింది ఒక ట్రే,కోకోపీట్,విత్తనాలు,చల్లగా ఉండే గది మాత్రమే. ట్రే ని కోకోపీట్ తో నింపి విత్తనాలు చల్లి,నీళ్లు పోసి కవర్ చేసి పెడితే చాలు నాలుగో రోజుకు మొలకలు వచ్చేస్తాయి. సూర్యరశ్మి చాలదు అని పిస్తే బెడ్ లాంప్ పెట్టాలి. నేనాలాగే ఈ మైక్రోగ్రీన్స్ పెంచాను అంటూ ఇన్ స్టాగ్రామ్ లో రాసిందామే సెలబ్రిటీలు పెట్టే పోస్ట్ లు చూసి ఈ లాక్ డౌన్ రోజులను ఫాన్స్ చక్కగా వాడుకొంటే మేలు కదా!

Leave a comment