ఒక వ్యాపారం సక్సెస్ కావాలంటే కొత్తగా ఏ దైన ఇవ్వగల ఒక ఐడియా కావాలి. ఖచ్చితంగా మార్కెట్ చేయగలిగినంత విలువైన ప్రోడక్ట్ అయి ఉండాలి. ఏ స్టార్టప్ చూసినా ఈ విషయం తెలిసిపోతుంది. హైదరాబాద్ లో సిప్సీ మాంక్స్ పేరుతో షేర్స్, మాక్ టైల్స్ తయారు చేసే ఒక స్టార్టప్ మొదలు పెట్టింది సాయి దీపిక. కొబ్బరి నీళ్ళు,కొబ్బరి పాలతో సీజనల్ పండ్లు,హెర్బల్స్ కలిపి గాజు సీసాల్లో సప్లై చేస్తారు.చెక్కర,రసాయనాలు,ఫ్రిజర్వేషన్లు ఏవి ఉండవు ప్రభుత్వ ఫుడ్ సేఫ్టి విభాగం ఇది ఆరోగ్యవంతమైన డ్రింక్ లే అన్ని సర్టిఫై చేసింది. కొత్తగా స్టార్టప్ లు పెట్టలానుకునే వాళ్ళు ఇప్పటికే మార్కేట్లో నిలదొక్కుకున్న ఇండస్ట్రీలను అధ్యాయనం చేస్తే మంచిది.

Leave a comment