కాఫీ తాగటం వల్ల ప్రత్యేకంగా నష్టం కానీ లాభం కానీ లేదని ఊబకాయం,మధుమేహం వంటి జీవన శైలి వ్యాధులు పెరగటం కానీ తగ్గటం కానీ జరగదని ఓ అధ్యయనం చెపుతోంది కాఫీ తాగటం లో ఉండే అపోహలను ఈ అధ్యయనం దూరం చేస్తోంది. కాఫీ శరీరం పై ఎలాటి ప్రభావం కలిగిస్తుందనే అంశాన్ని జన్యువుల ద్వారా మొదటి సారిగా అధ్యయనం చేశారు. కాఫీ తాగాలనే కోరిక పై ప్రభావం చూపించే జన్యువులకు టైప్ టూ మధుమేహం,ఊబకాయం తో సంబంధం లేదని పరిశోధన తెచ్చింది. కొన్ని జన్యువులు కాఫీ తాగాలనే కోరిక పెంచుతాయి అంతే. ఈ కాఫీ వల్ల నష్టము లాభము రెండు లేవు.

Leave a comment