జుట్టు రాలిపోతుంటే ఇంట్లోనే ఈ పదార్ధాలతో చక్కని మందు తయారు చేసుకోవచ్చు. సల్ఫర్ ఎక్కువగా వుండే ఉల్లి, సహజమైన మాయిశ్చురైజర్ తేనె, ఔషధ గునలుంటే ఎస్సెంషియల్ ఆయిల్స్ తో జుట్టుకు రక్షణా కవచం వంటి మంచి మందు తయ్యారవ్వుతుంది. ఐదు ఉల్లిపాయలు గుజ్జు చేసి రసం తీయాలి. ఈ గుజ్జు వడకట్టి వచ్చిన రసంతో అరకప్పు తేనె వేసి కలపాలి. ఇది బాగా కలిసాక, ఎసెంషియల్ ఆయిల్ ఓ పది చుక్కలు వేసి బాగా కలిపితే మందు తయ్యారైనట్లే. దీన్ని జుట్టు కుదుళ్ళ వరకు పట్టించి 45 నిమిషాలు మసాజ్ చేసి, తర్వాత తలస్నానం చేయాలి. వీలైతే రాత్రి వేల ఈ ఆయిల్ మసాజ్ చేసి ఉదయం వరకు అలా వదిలేసి తలస్నానం చేసినా మంచిదే. ఇలా వారంలో మూడు సార్లు చేస్తూ వుంటే జుట్టు పొడవుగా ఆరోగ్యంగా మంచి రంగులో పెరుగుతుంది.

Leave a comment