జుట్టు చివర్ల చిట్లిపోవటం చాలా మంది సమస్య. జుట్టు కుదుళ్ళు సహజమైన తేమ తగ్గిపోతే వెంట్రుక చివర చిట్లిపోతూ ఉంటుంది. తరచుగా హేయిర్ స్ప్రే లు జెల్స్ హేయిర్ కలర్ వాడటం వల్ల వచ్చే సమస్య ఇది. రెగ్యులర్ గా వాడే నూనెలో ఆముదం ఆలివ్ లేదా బాదం నూనె కలిపి మాడు నుంచి కోణాలకు అంటేలాగా రాయాలి. ఈ నూనెని వెచ్చ జేసి మస్సాజ్ చేసి హేయిర్ కాప్ పెట్టుకుని పడుకుని తెల్లరాక మైల్డ్ షాంపూ తో జుట్టు శుభ్రం చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ తేనె పెరుగు కలిపి కూడా హెయిర్ మాస్క్ వేసుకున్నా ఫలితం ఉంటుంది. పండిన బొప్పాయి గుజ్జుతో పెరుగు కలిపి జుట్టుకు వత్తుగా పట్టించి అరగంటాగి స్నానం చేసేయచ్చు.అరకప్పు మినపప్పు టేబుల్ స్పూన్ మెంతులు పొడి చేసి పెరుగు కలిపి తలకు పట్టించి ఆరనిచ్చి తలస్నానం చేయచ్చు. ప్రతిదానికి పెరుగు బేస్ గా ఉంచుకోవాలి. పెరుగుతో మిగతావి కలిపి హేయిర్ కి బాగా పట్టించి వాష్ చేయాలి . సాధారణంగా జుట్టు ఈ చిట్కాల తోనే చక్కగా పెరుగు తోంది. చివర్లు చిట్లటం పోతుంది. ఇవన్నీ ఇంట్లో దొరికే వస్తువులే కనుక సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏదీ వుండదు.
Categories
Soyagam

జుట్టు చివర్లు చిట్లుతున్నాయా

Leave a comment