ఫ్యాషన్ స్టైల్ మెంట్స్ లో హెయిర్ స్టయిల్ కూడా ముందుంటుంది.రకరకాల హెయిర్ స్టయిల్స్ వేసుకొన్నప్పుడు జుట్టు గట్టిగా దువ్వీ కొప్పుపెట్టడం,గట్టిగా బిగించటం వల్ల జుట్టు రాలి పోతుందని హెయిర్ స్పెషలిస్టులు హెచ్చరిస్తున్నారు.జుట్టు చక్కని ఉంగరాలు తిరిగి కనించేందుకు తడిగా ఉన్నప్పుడు ముడి బిగిస్తే తిరిగి దువ్వినప్పుడు చిక్కులు వస్తాయి. జట్టు బాగా వెనక్కి దువ్వినా దాన్ని మళ్ళీ పక్కలకు దువ్వి పాపిట తీసేందుకు ప్రయత్నం చేసిన వెంట్రకలు రాలిపోతాయి. అలాగే బిగుతూగా జడ అల్లే అలవాటు ఉన్న కూడా జుట్టు రాలిపోతుంది.జుట్టు ఎప్పుడు స్మూత్ గానే హేండిల్ చేయాలి. వేడి చేసిన కొబ్బరి నూనెతో కుదుళ్ళు మసాజ్ చేసి తల స్నానం చేయాలి. జుట్టు బాగా ఆరాకనే చిక్కులు తీయాలి.లాగి బిగించకుండగా ,జుట్టు తెగిపోకుండా ఏ హెయిర్ స్టయిల్స్ అయినా ప్రయత్నించాలి.

Leave a comment