జుట్టుకు పోషణ చేస్తేనే రాలకుండ ఆరోగ్యంగా ఉంటుంది. కొన్ని ప్యాక్స్ వేస్తే జుట్టు పట్టుకుచ్చులా ఉంటుంది. కొబ్బరి నూనె వేడి చేసి ఆలీవ్ ఆయిల్‌ కలిపి నెమ్మదిగా మునివేళ్ళతో ఈ ఆయిల్ రాస్తూ మాడుకు మర్ధనా చేయాలి. పదినిమిషాలపాటు ఇలా చేస్తే తలలో రక్తప్రసరణ బావుంటుంది. అలాగే గుడ్డు సొనలో అరటిపండు గుజ్జు,కొబ్బరి నూనె,పెరుగు కలిపి ప్యాక్‌ వేసుకుని ఒక అరగంట ఆగి తలస్నానం చేయటం మంచిది. అలాగే బీట్ రూట్ రసంలో మందారపూల పొడి కలిపి ప్యాక్ వేసుకోవచ్చు ఇలాంటి ప్యాక్ లు వేసుకున్నాక వేడి నీటిలో టవల్ ను ముంచి గట్టిగా పిండి తలకు చుట్టుకుంటే ఆ వేడికి ప్యాక్ లోని సుగుణాలు తలకు పడతాయి. గాఢత లేని షాంపుతో తలస్నానం చేస్తే జుట్టు చక్కగా ఉంటుంది.

Leave a comment