ఏ కాలుష్యం వల్లనైనా సమస్య సిరోజాలకే ఎక్కువగా వస్తుంది. కురులకు తగిన బలం ఇచ్చేందుకు సహజమైన పదార్ధాలు చాలానే వున్నాయి. గుప్పెడు మెంతులు రాత్రివేళ నీళ్ళలో పోసి తెల్లారే వరకు నాన బెట్టి గ్రాయిండ్ చేసి, ఆ పేస్ట్ తలకు పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీళ్ళలో కడిగేయాలి. వారంలో కనీసం మూడు సార్లు ఇలా చేయాలి. జుట్టును నీళ్ళలో తడిపి తాజా ఉసిరి రసం పట్టించాలి. అరగంట తర్వాత గోరు వెచ్చని ఆలివ్ ఆయిల్ తో జుట్టుకు మసాజ్ చేసి రాత్రంతా అలా వదిలేసి ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలాంటి సహజసిద్దమైన పదార్ధాలు నూనె ఉపయోగిస్తే జుట్టు కుదుళ్ళు గట్టిగా ఉంటాయి.

Leave a comment