ఎండలకు మాడు పొడిబారిపోయి దూరదలు పుట్టి జుట్టు పీచులా అనిపిస్తే అలోవేరా గుజ్జు వెంట్రుక చివర్ల వరకు పట్టించి అలా గంటసేపు వదిలేసి తలస్నానం చేస్తే చాలు జుట్టు పట్టు కుచ్చులా అయిపోతుంది. అలాగే బాధం,విటమిన్ ఇ ,ఆలివ్ నూనెను కలిపి జుట్టుకు పట్టించి మర్ధన చేస్తే జుట్టు ఊడకుండా ఆరోగ్యంగా పెరుగుతుంది. తలస్నానం చేసే ముందర తప్పని సరిగా కొబ్బరి నూనెతో మాసాజ్ చేసి స్నానం చేయాలి. కొబ్బరి నూనె మర్ధన జుట్టుకు సహాజమైన చికిత్స .అరటి పండ్ల గుజ్జు ,ఆలివ్ నూనెతో కలిపి తలకు మాస్క్ వేసుకొని తలస్నానం చేసిన జుట్టు చక్కగా మెరుస్తూ ఉంటుంది.

Leave a comment