తొందరగా జుట్టు ఆరిపోవాలని బ్లో డ్రయ్యర్ వాడుతుంటారు. ప్రతిరోజూ తలస్నానం అలవాటు ఉన్నవాళ్ళు దీన్న వాడితే దానిలో నుంచి వచ్చే వేడిగాలికి జుట్టు పొడిబారిపోతుంది. అప్పుడు జుట్టు మెరుపు తగ్గుతుంది. సాధ్యమైనంత దూరంలో పెట్టి వాడుకోవడం మంచిది. ఇలాంటి డ్రయ్యర్లు , స్ట్రయిట్నర్ల వల్ల జుట్టు పల్చబడుతుంది. జుట్టు సహజమైన నూనె పోగొట్టుకుని గడ్డిలాగా బిరుసుగా అయిపోతుంది. అలాగే అమ్మాయిలు తరచుగా వాడే స్త్రయిటనింగ్ సింధటిక్ ఉత్పత్తులు జెల్ మ్యాట్స్ వంటివి జుట్టుకు హాని కలిగిస్తాయి. ఇప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం కొబ్బరినూనె మసాజ్ జుట్టును యధాస్ధితిగా తీసుకువస్తుంది. జుట్టు మెరిసిపోతూ పట్టులా అయిపోతుంది.

Leave a comment