కొందరికి పుట్టుకతోనే జుట్టు కాస్త పల్చగా ఉన్నట్లు అనిపిస్తుంది. మంచి ఆహరంతో ఉన్న జుట్టు ఆరోగ్యవంతంగా ,ఇంకస్తా ఒత్తుగా ఉండే అవకాశం ఉంటుంది. జుట్టు ఆరోగ్యానికి ప్రోటీన్లు కావాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే చికెన్ ,చెప,గుడ్లు వంటి మాంసాహారంతో పాటు పాలు,పెరుగు ,పప్పు ధాన్యాలు విరివిగా పిల్లలకు ఇవ్వాలి. రోజుకు అరలీటర్ పాలు ,ఒకటో రెండో గుడ్లు ఇవ్వచ్చు. చేప, రోయ్యలు, కందులు ,సెసలు మినువుల, ఐరన్ ,జింక్ ఉంటాయి. బాధం,పిస్తా వాల్నట్స్, అవిసె కూడా తప్పనిసరిగా రోజు ఇవ్వాలి. ఇలాంటి ఆహారం ప్రతి దినం అందటం వల్ల వీటన్నింటిలో ఉండే ఒమేగా-3 ఫాటీ ఆసిడ్లు లభిస్తాయి.జన్యుపరమైన సమస్యలు జుట్టు విషయంలో ఉండే ముందే డాక్టర్ ను కలవటం మంచిది.

Leave a comment