కరివేపాకు భోజనం లోని రుచి ఇవ్వటమే కాదు జుట్టు పెరుగుదలకు మంచి ఔషధం వంటిది అంటున్నారు ఎక్సపర్ట్స్. కరివేపాకు లో ఉల్లిపాయ రసం కలిపి మెత్తగా రుబ్బి మాడుకు పట్టించి గంట తర్వాత షాంపూ చేస్తే తల నెరవటం వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. మెంతి ఆకులు, కరివేపాకు కప్పు చొప్పున తీసుకొని మెత్తగా రుబ్బి దానికి రెండు స్పూన్ల ఉసిరి పొడి కలిపి మాడుకు రాసి అరగంట పాటు ఉంచి తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి జుట్టు కుదుళ్ళ నుంచి దృఢంగా తయారవుతుంది. అలాగే కరివేపాకు మెత్తగా మిక్సీ పట్టి అందులో పెరుగు కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత కడిగేస్తే చుండ్రు అదుపులోకి వస్తుంది.

Leave a comment