Categories
జుట్టుకు సంబంధించి ఎన్ని మసాజ్ లు, స్పా చికిత్సలు తీసుకొన్న పోషకపదార్థాలు సరిగా తీసుకొంటేనే జుట్టు రాలిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఆహారం ద్వారా అందిన ఐరన్ వంట పట్టేలా చేస్తుంది ‘సి’ విటమిన్. కాబట్టి నిమ్మ ,ఉసిరి తప్పని సరిగా ఆహారంలో భాగం అవ్వాలి. అలాగే అందమైనది అందాన్నిచ్చేది విటమిన్ ‘ఇ’ . ఇది జుట్టును పోడవుగా పెంచగలుగుతోంది. అందుచేత బాదం గింజలు తీసుకోవాలి. అలాగే విటమిన్ ‘ఇ’ మాత్రలను కొబ్బరి నూనెతో కలిపి రాసుకోని ఓ అరగంట తర్వాత కడిగేస్తే జుట్టుకు విటమిన్ ‘ఇ’ దొరుకుతోంది. జుట్టు ఆరోగ్యం రహస్యం ఇదే.