కాబోయే తల్లులకోసం ఎన్నెన్నో అధ్యాయినాలు జరుగుతూనే ఉంటాయి. ఆరోగ్య పరమైన జాగ్రత్తలు , ఆహారం గురించిన హెచ్చరికలు, నెలలు గడుస్తున్న కొద్దీ శరీరంలో కలిగే మార్పుల గురించిన అధ్యాయినాలు, ఎన్నో రిపోర్టులు, రీసెర్చ్ లు వస్తుంటాయి. ఇప్పుడు గర్భం దాల్చిన మహిళలు కొవ్వు పదార్దాలు ఎక్కువగా వుండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల తల్లుల్లో ఆరోగ్య సమస్యలు రావడమే కాదు పిల్లల్లో మెదడు పెరుగుదల లో  లోపాలు తలెత్తుతున్నాయని ముఖ్యంగా వాళ్ళలో హార్మోన్ల అసమతుల్యత వల్ల ఆందోళన డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తలెత్తే అవకాశం వుందని ఒరిగన్ హెల్త్ అండ్ సైన్స్ యునివర్సిటి పరిశోధనలు చెప్పుతున్నాయి. అధిక కొవ్వు పదార్ధాలతో గర్భిణులు కుడా వుబకాయులుగా మారే ప్రమాదం వుందని హెచ్చరిస్తున్నారు. ఆహారం విషయంలో బిడ్డ శ్రేయస్సు కోరి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు.

Leave a comment