చక్కగా మాట్లాడడం కూడా ఒక అద్భుతమైన కళే మాటలు పుల్ల విరిచినట్లు కటువుగా కాకుండా మలయమారుతపు స్పర్శ లాగా ఎదుటివాళ్ళను  తాకాలి. చక్కని మాటకారులు అవ్వాలంటే సంభాషణని విమర్శతో ఫిర్యాదుతో ఎదుటివారిని తప్పుపట్టడం తో మొదలు పెట్టకూడదు. ఆ తర్వాత ఎంత మంచి విషయాలు చెప్పిన అందులోని వాస్తవాలను అంగీకరించవలసిన  అభిప్రాయాలను కూడా అవతలవారు వ్యతిరేక దృక్పథంతోనే చూస్తారు. అందుకే మన సంభాషణలు మొదటిగా ఏమండీ బావున్నారా, ఆరోగ్యంగా ఉన్నారు? పిల్లలు ఎలా ఉన్నారు వంటి ఉభయ కుశలతతో పద్ధతిలో మాటలు ఉంటాయి. ఒక సర్వే లో ఒక గొప్ప స్థాయి సంభాషణలు 50 విలువైన పదాలు ఉంటాయని తేల్చాయి అవి ఉత్సాహం, కృతజ్ఞత, ఆత్మవిశ్వాసం, నైతిక విలువలు వంటి పదాలే అందుకే ఎదుటి వాళ్ళతో మాట్లాడేందుకు చక్కని నొప్పించని పదాలతో కదంబ మాలిక వంటి మాటలు మాట్లాడాలి

చేబ్రోలు శ్యామసుందర్
9849524134

Leave a comment