సృజన గల కళకు హద్దులు లేవు . ఇప్పటి వరకు ఎన్నో వర్ణాలతో ఎన్నో ఆలోచనలు నింపిన పెయింటింగ్స్ చూసి ఉంటారు . ఆ సప్తవర్ణ అందాలన్నీ కేవలం జీన్స్ తో సృష్టిస్తున్నారు . ఆర్టిస్ట్ ఇయాన్ బెర్రీ ఇంగ్లాండ్ కు చెందిన ఈ కళాకారుడు ముందుగా తాను రూపొందించాలని అనుకొన్న దృశ్యాన్ని ఫోటో తీస్తాడు . అందులో కనిపించే వెలుగు నీడల్ని జీన్స్ క్లాత్ లో రకరకాల షేడ్లు ని ముక్కలుగా కత్తిరించి ఆచం ఆ ఫోటో లో లాగా అంటిస్తూ వస్తాడు . అంటే ఫోటోని ఈ జీన్స్ ముక్కలతో పెయింటింగ్ లా అమర్చేస్తాడు . పోనీ అవేమీ కొత్తవి కూడా కాదు పాతబడిన రంగు వెలిసిన జీన్స్ . ఆ రంగుల తోనే ఈ  డెనిమ్ ఆర్ట్ ని సృష్టించాడు ఇయాన్ బెర్రీ .

Leave a comment