ఇదినా పదిహేనేళ్ళ కథ. తలైవా పక్కన నటించాలన్న కల ఇప్పుడు నిజమైంది. ఎంతో ఆనందంగా ఉంది. కొన్ని కలలు మనం నిద్ర లేచినా కలలోనే ఉన్నట్లుగా అనిపిస్తాయి.ఈ వార్త నాకు అలాంటిదే అంటుంది త్రిష.కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ సరసన త్రిష నటించబోతుంది. విజయ్ సేతుపతి ఇందులో విలన్ గా నటిస్తున్నారు. దక్షిణాదిన అగ్రనాయకులందరితో త్రిష నటించింది. కానీ రజనీ కాంత్ తో ఆమెకు అవకాశం రాలేదు.అయిన పక్కన నటించాలని నేను కలలు కంటున్నాను. అది నిజమైంది అంది ఆనందంలో త్రిష. సిమ్రాన్ ఇందులో ప్రతినాయక ఛాయలున్న పాత్రపోషిస్తుంది. రజనీకాంత్ తో నటించడం సిమ్రాన్ కు కూడా తొలిసారి.

Leave a comment